![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ కార్తీక దీపం2(Karthika Deepam2). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-352లో.. కార్తీక్ వెళ్లిపోగానే.. ఆ దీప ఆసుపత్రిలోంచి బయటికి వచ్చినా.. జైల్లో శిక్ష అనుభవించాల్సిందే అని అనేసి శివనారాయణ లోపలికి వెళ్లిపోతాడు. మీరేం కరగకండి.. ఆ దీప కోసం కార్తీక్ నాటకాలు ఆడుతున్నాడు అంతే అనేసి పారిజాతం వెళ్లిపోతుంది. ఇక దశరథ్.. సుమిత్రా ఇలా రా కూర్చో.. కాస్త దీప గురించి కాకపోయినా కార్తీక్ గురించి ఆలోచించాల్సింది. అయినా పొంది సాయాన్ని మరిచిపోకూడదు సుమిత్ర.. నా కోసం ఈ సాయం చేసిరా అంటాడు. సరే అంటుంది సుమిత్ర. అంతా జ్యోత్స్న వింటుంది. మమ్మీ నువ్వు ఇవ్వద్దు రక్తం.. నేను ఇచ్చి వస్తాను.. నా తల్లిని కాపాడిన ఆ దీప రుణం నేను తీర్చుకుని వస్తానని సుమిత్రను ఆపేసి తను వెళ్లిపోతుంది. చూశారా.. నా కూతురు.. ఎంత గొప్పదో.. ఆ దీప వల్ల ఎంత నష్టం జరిగినా సాయం చెయ్యడానికి వెళ్లింది.. అదండీ నా జ్యోత్స్న అని సుమిత్ర మురిసిపోతుంది.
మరోవైపు కార్తీక్ బాధగా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంటే దారిలో ఓ చిన్న గుడి కనపడటంతో.. దేవుడికి మొక్కుకుంటాడు. ఇంతలో అతనికి డాక్టర్ నుండి కాల్ వస్తుంది. బ్లడ్ కోసం వెతుకుతున్నా డాక్టర్ అని కార్తీక్ అనగానే డోనర్ దొరికారు హాస్పిటల్ కి రమ్మని డాక్టర్ చెప్తుంది. ఇక కార్తీక్ వెళ్తూ కాశీకి ఫోన్ చేసి జరిగిందంతా చెప్తాడు. అదే విషయం స్వప్నకు కాశీ చెప్తాడు. ఏంటి కాశీ.. దీప వదినకు ఈ కష్టం.. కనీసం సుమిత్ర అత్త పొందిన సాయాన్ని కూడా మరిచిపోయి మాట్లాడటం ఏంటీ? డోనర్ దొరికాడు కాబట్టి సరిపోయింది. లేదంటే దీప వదినకు ఏం జరిగి ఉండేదని అరుస్తూ ఉంటుంది. బెయిల్ మీద బయటికి వచ్చిన దీప వదినను చంపాలని ఎవరనుకుంటారంటూ స్వప్న బాధపడుతుంటే వెనుక గదిలో ఉన్న దాస్ వింటాడు. ఆ జ్యోత్స్న ఏదో చేస్తుందని అనుకుంటాడు దాస్. పదా వెళదామని స్వప్న అనగానే కార్తీక్ వద్దన్నాడని కాశీ చెప్తాడు. ఆసుపత్రి పక్కనే అంటున్నారంటే ఆ పెద్ద ఆసుపత్రిలోనే చేర్పించి ఉంటారు.. నేను వెంటనే వెళ్లాలి. దీపను చూడాలి అని దాసు అనుకుంటాడు. వెంటనే కాశీ, స్వప్నలకు తెలియకుండానే వాళ్ల వెనుక నుంచి వెళ్లిపోతాడు. మరోవైపు దీప దగ్గర నర్సు ఉంటుంది. ఆవిడకు ఊపిరి అందడం లేదని గమనించిన నర్స్ వెంటనే పరుగుతియ్యడంతో కాంచన, అనసూయ ఇద్దరు గుండెల పట్టుకుని ఏడుస్తుంటారు. ఇంతలో కార్తీక్ వచ్చి.. ఏమైందమ్మా అనేసరికి.. నర్స్ మాటల గురించి చెప్తారు. ఇక సుమిత్ర అన్న మాటల గురించి కార్తీక్.. వాళ్లతో చెప్తాడు. దాంతో వదిన అలా మాట్లాడిందా అంటు కాంచన బాధపడుతుంది.
ఇంతలో డాక్టర్ వచ్చి కార్తీక్‌తో మాట్లాడుతుంది. కార్తీక్.. ఆ డోనర్ కాల్ చేసి బ్లడ్ నేను ఇస్తాను అన్నాడు. తిరిగి చేస్తుంటే లిఫ్ట్ చేయడంలేదు. కొన్నిసార్లు స్విచ్ ఆఫ్ వస్తుంది. కాస్త చూడమని నంబర్ చూపిస్తుంది. దాంతో కార్తీక్ వెంటనే ఆ నంబర్ తన ఫోన్‌లో ఎక్కించుకుని.. కాల్ ట్రై చేస్తూనే ఉంటాడు. అయితే లిఫ్ట్ చేసిన డోనర్.. సర్ నేను ఆసుపత్రి బయటే ఉన్నాను.. మీరు ఒకసారి రండి అని ఫోన్ పెట్టేస్తాడు. కార్తీక్ బయటకు వస్తాడు. ఇక అప్పుడే కార్ లో నుండి జ్యోత్స్న దిగుతుంది. డోనర్ నా మనిషే బావా.. నీకు నీ భార్య ప్రాణాలతో కావాలంటే నేను అడిగిన చోట ఓ సంతకం పెట్టు అంటూ ఎమ్టీ కాగితాలను తీసుకుని పెన్ పట్టుకుని అడుగుతుంది. కార్తీక్ మొదటగా రిక్వెస్ట్ చేస్తాడు.. ఆ తర్వాత కోపంగా హెచ్చరిస్తాడు. ఆవేదనగా తిడతాడు. ఏం చేసినా జ్యోత్స్న డిమాండ్ మాత్రం మారదు. పదిహేను నిమిషాలే టైమ్ బావా.. లేదంటే నీ భార్య చస్తుంది చూసుకోమని జ్యోత్స్న అంటుంది. ఇక అప్పుడే దాసు ఎంట్రీ ఇస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |